ఆసియా కప్ కొట్టేది వీరే…వాట్సన్
ఆసియా కప్ 2022 మ్యాచ్ గురించి అందరిలో ఉత్కంఠ మొదలవుతుంది. క్రికెట్ ప్రియులు మాత్రం మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురుచుస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే అంశంపై ఎవరికి తోచిన జోస్యం వారు చెప్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సారి జరిగే ఆసియాకప్ లో భారత్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

టీవిండియా మంచి ఫామ్‌లో ఉందని , అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడే సత్తా భారత్ జట్టుకు ఉందన్నారు వాట్సన్. అయితే ఇదే అంశంపై ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఎవరు తక్కువ తప్పులు చెస్తే వారే విజేతలుగా నిలుస్తారన్నారు.