Home Page SliderInternational

ప్రపంచంలోనే అగ్రగామిగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం అరుదైన గుర్తింపును పొందింది. కాగా ప్రపంచంలోనే అత్యంత సమయపాలనతోపాటు గ్లోబల్ ,లార్జ్ విభాగాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఏవియేషన్ అనలిటికల్ సంస్థ సీరియమ్ (CIRIUM) ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. కాగా ఈ సంస్థ విమానాశ్రయాల ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్చి నెలలో 90.43% ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ నమోదు చేసిందని సీరియమ్ నివేదికలో వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే 90% మార్కును దాటిన ఏకైక  అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ) రికార్డు సృష్టించింది.