పుతిన్‌కు సిగ్గుచేటు -ప్రసంగానికి “నోక్లాప్స్”
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సిగ్గుపడే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన విదేశీ రాయబారులనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఎవరూ చప్పట్లు కొట్టలేదు. విషయం ఏంటంటే ఇటీవల రష్యాకు 17 దేశాల రాయబారులు నియమింపబడ్డారు. వారు పుతిను కలిశారు. ఈ సందర్భంగా గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో కార్యక్రమం ఏర్పాటు చేసి, పుతిన్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో యూరోపియన్ దేశాలపై, అమెరికాపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఆ దేశాల రాయబారులే కారణమని ఆరోపణలు చేశారు. 2014లో ఉక్రెయిన్ తీర్మానానికి అమెరికా మద్దతివ్వడమే కారణమంటూ వ్యాఖ్యానించాడు. దీనితో ఈ ప్రసంగానికి అక్కడున్న విదేశీ రాయబారులెవ్వరూ చప్పట్లు కొట్టలేదు. ప్రసంగం ముగించుకుని, కాస్త సమయం అందరివంకా చప్పట్ల కోసం వేచి చూసాడు. దీనితో పుతిన్ విమర్శకులు ఈ వీడియోను వైరల్ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టి సంవత్సరం గడిచిపోయినా, అది కొలిక్కి రాకపోవడం, అమెరికాతో విభేదాలు వంటి విషయాలలో పుతిన్ అంతర్జాతీయంగా పేరు పోగొట్టుకున్నారు.

