రాజభవన్ వద్ద SFI విద్యార్థి సంఘాల ఆందోళన
తెలంగాణ రాజభవన్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. SFIకి చెందిన పలువురు నేతలు, విద్యార్థులు రాజభవన్ ముట్టడికి ప్రయత్నించారు. నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం తెలిసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ జోక్యాన్ని తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవిభజన హామీలో ఇచ్చిన ఉన్నత విద్యాలయాలను రాష్ట్రానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 2020 నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వీరిని అడ్డుకుని, అక్కడి నుండి దూరంగా తీసుకెళ్లారు. పలువురిని అడ్డుకున్నారు.