crimeHome Page SliderNational

చెన్నైలో విద్యార్థినిపై లైంగిక దాడి..ప్రభుత్వంపై మండిపాటు

చెన్నైలోని  అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలోనే బీటెక్ విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనపై ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. యూనివర్సిటీ లేబరేటరీ సమీపంలో స్నేహితుడితో కలిసి వెళ్తున్న విద్యార్థినిపై, ఆమె స్నేహితుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. అతను పారిపోయాడు. అనంతరం రికార్డు చేసిన ఆమె వీడియోలు చూపించి, లైంగిక దాడికి ప్రయత్నించాడు. తప్పించుకున్న విద్యార్థిని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులకు అక్కడ సమీపంలో బిర్యానీ విక్రయించే జ్ఞానశేఖరన్ అనే వ్యక్తిగా గుర్తించారు. దీనితో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. బహిరంగ ప్రదేశాలలో కూడా మహిళలకు భద్రత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అంటూ విమర్శిస్తున్నారు.