Home Page SliderNational

అయోధ్య.. మిథిలా నగరాలను తలపించేలా సెట్టింగులు..

భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ అందరి చూపు రామాయణ సినిమాపైనే. ఈ చిత్రాన్ని నితీశ్ తివారీ తీస్తున్నారు. తన సహజమైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సాయిపల్లవి సీతగా కనిపించగా, రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తూ.. దీన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం పన్నెండు భారీ సెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రామాయణంలో కీలకమైన అయోధ్య, మిథిలా నగరాలను తలపించేలా ఆ సెట్లను తీర్చిదిద్దుతోందట చిత్రబృందం. ముంబైలో 3డీ ఫార్మాట్‌లో, భారీ ఖర్చుతో వాటిని పునఃసృష్టించనున్నట్లు సమాచారం. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో సన్నీ డియోల్, లారా దత్తా, రకుల్‌ప్రీత్‌ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది డిసెంబరులో విడుదల కానుంది.