చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లా గంగాసాగరం సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న టిప్పర్‌ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి పల్టీలు కొట్టింది.దాదాపు 200 మీటర్ల దూరం మేర బస్సు పలు సార్లు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో మరో 22 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు గమనించి బస్సులో ఉన్న క్షతగాత్రులను అతి కష్టం మీద వెలుపలికి తీశారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు.మృతదేహాలను బస్సు నుంచి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.గాయాలపాలైన వారిని సీఎంసి వేలూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.