సీరియల్ యువ నటుడు మృతి
హిందీ సీరియల్ యువ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన ముంబైలోని జోగేశ్వరి హైవేపై బైక్ పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అమన్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. అమన్ ‘ధర్తీపుత్ర నందిని’ అనే సీరియల్ లో లీడ్ రోల్ లో నటించాడు.