Home Page SliderInternational

సెర్బియా స్కూల్ కాల్పుల ఘటన, 8 మంది విద్యార్థులు హతం

14 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం బెల్‌గ్రేడ్ తరగతి గదిలో తన ఉపాధ్యాయుడిని కాల్చి చంపేందుకు ప్రయత్నించాడు. ఇతర విద్యార్థులు, సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపిన ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. మిలన్ మిలోసెవిక్, వ్లాడిస్లావ్ రిబ్నికర్ ఎలిమెంటరీ స్కూల్‌లోని ఈ ఘటన జరిగింది. మొదట ఉపాధ్యాయుడిని కాల్చేసి, ఆపై కన్పించిన విద్యార్థులపై తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉపాధ్యాయుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు పోరాడుతున్నారని వ్రాకార్ జిల్లా మేయర్ మిలన్ నెడెల్జ్‌కోవిక్ తెలిపారు.

ఎనిమిది మంది పిల్లలు, ఒక సెక్యూరిటీ గార్డు మరణించారని, ఉపాధ్యాయుడితో పాటు ఆరుగురు పిల్లలు ఆసుపత్రి పాలయ్యారని హోం శాఖ పేర్కొంది. కాల్పులకు తెగబడ్డ ఏడో తరగతి విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. “టేబుల్ కింద పడి ఉన్న సెక్యూరిటీ గార్డును చూశాం. ఇద్దరు అమ్మాయిలు వారి చొక్కాలపై రక్తం ఉంది. షూటర్ నిశ్శబ్దంగా ఉన్నాడని, మంచి విద్యార్థి” అంటూ కాల్పుల ఘటన తర్వాత విద్యార్థులు చెప్పారు. కాల్పుల ఘటన తర్వాత, హెల్మెట్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ దుస్తులు ధరించి భద్రతా దళాలు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని… కాల్పుల వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. కఠినమైన తుపాకీ చట్టాలు ఉన్న సెర్బియాలో ఇలా బహిరంగంగా కాల్పులు జరపడం అరుదు. కానీ పశ్చిమ బాల్కన్‌లు 1990లలో యుద్ధాలు, అశాంతి తరువాత వందల వేల అక్రమ ఆయుధాలు ప్రజలకు చేరాయి. సెర్బియా అధికారులు అక్రమ తుపాకులను అప్పగించడానికి లేదా నమోదు చేయడానికి యజమానులకు అనేకసార్లు విజ్ఞప్తులు చేశారు.