NationalNews Alert

సెప్టెంబర్‌లో మూవీ ఫెస్ట్

సెప్టెంబర్ నెలంతా సినిమాల జోరు కోనసాగనుంది. దాదాపు ఈ నెలలోనే చిన్న చిత్రాల నుండి ప్యాన్ ఇండియా మూవీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 2 న రంగ రంగా వైభవంగా ఫస్ట్ డే ఫస్ట్ ఫో బానే ఉందన్న టాక్ నడుస్తోంది. అలానే 9న విడుదల కానున్న బ్రహ్మాస్త్ర మూవీ పై ఇప్పటికే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. బిగ్ బీ అమితా బచ్చన్ , అక్కినేని నాగార్జున , రన్‌బీర్ కపూర్ , అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం టైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 23 న ఒకే ఒక జీవితం , నేను మీకు బాగా కావల్సినవాడిని , షాకిని డాకిని తదితర చిత్రాలు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు , ప్యాన్ ఇండియా మూవీస్ అంతగా ఏమిలేని కారణంగా ఈ చిత్రాలను పట్టాలు ఎక్కించేందుకు చూస్తున్నారు నిర్మాతలు.