Andhra PradeshNewsNews Alert

చర్చలు విఫలం .. ఛలో విజయవాడ యధాతధం

సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. పాత అంశాలనే మళ్ళీ  ప్రస్తావనకు తెచ్చి అసలు విషయాన్ని మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. దీంతో వచ్చేనెల 1న తలపెట్టిన ఛలో విజయవాడ యధాతధంగా కొనసాగుతుందని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఉద్యోగ సంఘాల నేత రామాంజనేయులు స్పష్టం చేశారు. గత 6 నెలలుగా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్లు చెల్లించడం లేదని .. అందేమంటే కేంద్రం నుండి రావాల్సి నిధులు రాలేదని అంటునన్నారని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. శాంతియుత ఆందోళనలకు కూడా అనుమతి ఇవ్వడం  లేదని , సెప్టెంబర్ 1న పూర్తిగా బ్లాక్ డే పాటిస్తామని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.