crimeHome Page SliderNational

కోల్‌కతా వైద్యురాలి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి శరీరంపై దోషి సంజయ్ రాయ్ డీఎన్‌ఏతో పాటు ఒక మహిళ డీఎన్‌ఏ కూడా కొద్ది స్థాయిలో లభించినట్లు సమాచారం. పైగా ఈ నేరంలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు తనకు తెలిపారని జూనియర్ వైద్యురాలి తండ్రి ఆరోపించారు. తన కుమార్తె గొంతుపై గాయాలున్నా స్వాబ్ సేకరించలేదని, కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ దర్యాప్తు, కోర్టు విచారణలు అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు తాను ఏ నేరం చేయలేదని, తనను ఇందులో ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదనలు వినిపించాడు. అయితే సోమవారం నాడు కోర్టు అతనికి జీవితఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది.