బాలుడు అమర్నాథ్ హత్య కేసులో సంచలన విషయాలు
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలో పదవ తరగతి బాలుడిపై దారుణంగా పెట్రోల్ పోసి కాల్చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఈ బాలుడిని అమర్నాథ్‌గా గుర్తించారు. పోలీసులు ఈ కేసులో చాలా వేగంగా పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. తన అక్కను వేధిస్తున్నాడనే కారణంతో అమర్నాథ్ వెంకటేశ్వర రెడ్డి అనే తాపీ పని చేసుకునే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. దానితో ఆగ్రహించిన వెంకటేశ్వర రెడ్డి తన స్నేహితులతో కలిసి, బాలుడిని హత్య చేశారు. బాలుడి కుటుంబానికి అండగా ఉంటామని, నష్టపరిహారంతో పాటు అతని అక్కకు అంగన్వాడీ ఉద్యోగం ఇస్తామని ఎంపీ మోపిదేవి హామీ ఇచ్చారు. కాగా బాలుడికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడని, దానితో తన అక్కకు అతడే రక్షణగా ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు.

