గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకంపై హైకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను హైకోర్టు కొట్టేసింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థులను కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్ కు పంపాలని హైకోర్టు అభిప్రాయపడింది. గతంలో ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల నియామకాన్ని వీటో చేసే అధికారం గవర్నర్ కు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. గవర్నర్ అభ్యర్థుల వ్యవహారాన్ని కేబినెట్ కి తిప్పి పంపాలే గానీ… తిరస్కరించరాదని పేర్కొంది.

