గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు…
పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందిన ఘటన నగరాన్ని వణికించింది. ఒకే కుటుంబంలోని ఇంతమంది మృత్యువాత పడడంతో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. తాజాగా ఈ దుర్ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్ వ్యవహారమే కారణంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కరెంట్ అధికారులు, ఫైర్ సిబ్బంది. అక్కడి హైటెన్షన్ వైర్ల నుండి కొక్కీల ద్వారా కొందరు కరెంట్ కనెక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కరెంట్ వల్ల బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌పై లోడ్ ఎక్కువయ్యింది. ఏసీలు కూడా ఆన్‌లో ఉండడంతో మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే దట్టంగా పొగ వ్యాపించడంతో శ్వాస అందకే ఎక్కువ మంది మరణించారు.