కర్నూలు బస్సు ప్రమాదం డ్రైవర్‌పై సంచలన వివరాలు వెలుగు
కర్నూలు సమీపంలో నిన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ప్రమాద బస్సును పల్నాడు జిల్లా ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపినట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం హెవీ వాహన లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదివి ఉండాలి. అయితే లక్ష్మయ్య 5వ తరగతి వరకే చదివి, నకిలీ టెన్త్ సర్టిఫికేట్ ఆధారంగా హెవీ లైసెన్స్ పొందినట్లు సమాచారం.
ఇది మొదటి ప్రమాదం కాదని అధికారులు చెబుతున్నారు. 2014లోనూ లారీ నడుపుతూ లక్ష్మయ్య ప్రమాదానికి గురయ్యాడని, ఆ ఘటనలో క్లీనర్ మృతిచెందినట్లు రికార్డులు చూపుతున్నాయి.
ఈ వివరాలతో మరోసారి డ్రైవర్ అర్హతలు, లైసెన్స్ మంజూరులో ఉన్న లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

