Andhra PradeshNews Alert

పవన్ పై అంబటి సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ ట్వీట్లపై పలువురు వైసీపీ మంత్రులు భారీ కౌంటర్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే అంబటి రాంబాబు కూడా పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టికుని చంద్రబాబుకు పవన్ కన్ను కొడుతున్నాడని విమర్శించారు. ఎవరితో పొత్తు ఉందో కూడా తెలియని పవన్‌ను చూస్తుంటే జాలేస్తోందంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు విధిలించే ఎంగిలి మెతుకుల కోసం పవన్ ఎదురుచుస్తున్నారని ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందా? అని ప్రశ్నించారు. మెలుకువ వచ్చినప్పుడల్లా వచ్చి మాట్లాడితే ఎలా సక్సెస్ అవుతారని ప్రశ్నించారు.