“కేసీఆర్ ని ఏమన్నా అంటే ఉడికించి కొడతాం”… ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ ను తిడితే పెద్ద నేతలు అవుతామని భ్రమల్లో వున్నారు.. తస్మాత్ జాగ్రత్త కేసీఆర్ ని ఏమన్నా అంటే ఉడికించి కొడతాం..ఇవాళ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ,కాళేశ్వరం కింద పంటలు ఎండిపోతున్నాయి.. సోయి లేని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రైతుల బాధలు తెలవదు ..
ఆయన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్ లో కూడా పంటలు ఎండిపోతున్నాయి . మేము పూర్తి చేసిన ప్రాజెక్టుల కింద కూడా నీళ్లు ఇవ్వాలని చేతగాని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి… నాగార్జునసాగర్ కింద కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా అధికార దర్పంతో అడ్డగోలు మాటలతో టైంపాస్ చేస్తున్నాడు ఉత్తంకుమార్ రెడ్డి .. కన్నెపల్లి మేడిగడ్డ పంపులను స్టార్ట్ చేసి ఇప్పటికైనా నీరు ఇవ్వాలి.. సాగర్ కింద ఎత్తిపోతలకు పూర్తిస్థాయిలో నీరు అందించి చూపించు..
కేసీఆర్ గారు సరైన సమయంలో బయటికి వస్తారు ..వీళ్ళ బండారాన్ని బయటపెడతారు.. ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు.. దొంగలకే దొంగ మాటలు వస్తాయి.. పనిచేతగాక హెలికాప్టర్లో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు మంత్రులు.”.అంటూ విమర్శించారు.

