తెలంగాణా గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
నేడు తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగే తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణా గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై తెలంగాణా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధిని మాత్రమే చూడటం సరికాదన్నారు. తెలంగాణాలో ఉన్న మారుమూల పల్లెలు సైతం అభివృద్ధి చెందితేనే అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందన్నారు. రాష్ట్రంలో నీళ్లు,నిధులు,నియామకాలు అందరికీ అందాలనేదే ఉద్యమ ఆకాంక్ష అవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. కానీ తెలంగాణాలో కొన్ని ఉన్నత పదవుల్లో ఇది పాటించడం లేదని గవర్నర్ వెల్లడించారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు తెలంగాణా సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసైకు మధ్య సత్సంబంధాలు లేవన్న విషయం తేలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాలలో చర్చనీయాంశమైయ్యాయి.