Andhra PradeshNews Alert

ఏపీ సీఎం జగన్‌కు నారాయణ చురకలు

సీపీఐ నారాయణ ఎప్పడు ఎదో ఒక విమర్మలు చేస్తు వార్తల్లో నిలుస్తుంటారు. మెన్నటి వరకు బిగ్‌బాస్ షో పై విమర్శలు చేసిన ఆయన..తాజాగా సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అని జగన్ హామీ ఇచ్చి సీఎం అయ్యారని… కానీ సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందన్నారు. అంతే కాక రాష్ట్రాన్ని సీఎం జగన్ ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. అసలు పాదయాత్రలు , ర్యాలీలు అంటే ఎందుకు కోపం అని ప్రశ్నించారు. ప్రజలు జగన్ సీఎం పదవీ నుండి దిగిపోవాలని ర్యాలీలు , పాదయాత్రలు చేయడం లేదని..అమరావతిని రాజధాని చేయాలని పాదయాత్రలు చేస్తున్నారన్నారు. మీరు , మీ నాన్న పాదయాత్రలు చేసే సీఎం పదవులు పొందారన్నది గుర్తుంచుకోవాలన్నారు.