ఎన్టీఆర్ వర్థంతి సభలో టీడీపీ సభ్యుడు సంచలన వ్యాఖ్యలు
మైదుకూరులోని ఎన్టీఆర్ వర్థంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సభా వేదికపై ఆయన మాట్లాడుతూ నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన చాలాకాలం తర్వాత 3వ తరం నాయకుడు పార్టీలో చురుగ్గా ఉన్నారని, అందుకే లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు. కడప నుండి హెలికాప్టర్‌లో ఆయన మైదుకూరు చేరుకున్నారు.