అగ్రనేతలపై ఈడీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హొరాల్డ్ కేసులో వీరిద్దరికీ సంబంధం ఉందని ఆరోపించింది. ఈ కేసులో వీరు కీలకంగా ఉన్నారని, భారీగా లబ్ది పొందారని పేర్కొంది. సోనియా, రాహుల్ ఇద్దరూ ఈ కేసులో నేరానికి పాల్పడడమే కాకుండా రూ.142 కోట్ల లబ్ది పొందారని కోర్టుకు తెలియజేశారు ఈడీ అధికారులు. ఏఐసీసీ నిధులను (ప్రజా విరాళాలతో సహా) ఏజేఎల్ ఆస్తుల నియంత్రణను సోనియా, రాహుల్ గాంధీలకు ప్రయోజనకరంగా యాజమాన్యంలోని వైఐఎల్‌కు మోసపూరితంగా బదిలీ చేయడానికి ఉపయోగించారని ఈడీ ఆరోపిస్తోంది.