ఐపీఎల్ వేలంలో సంచలనం.. గ్రీన్ కామెరూన్ హెల్త్ మిస్టరీ
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ రికార్డు ధరతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అబుదాబిలో జరిగిన వేలంలో కేకేఆర్ రూ.25.20 కోట్లతో అతడిని కొనుగోలు చేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ భారీ ధర వెనుక గ్రీన్ ఎదుర్కొన్న కష్టాలు, అతని తీవ్రమైన ఆరోగ్య సమస్యల మిస్టరీ ఉంది.
అదేంటంటే.. కామెరూన్ గ్రీన్‌కు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉంది. ఈ సమస్య తల్లి గర్భంలోనే గుర్తించారు. అతని కిడ్నీలు కేవలం 60శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం స్టేజ్-2లో ఉన్నాడు. పుట్టినప్పుడు వైద్యులు 12 ఏళ్లు మించకపోవచ్చని చెప్పారు. కానీ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, పట్టుదలతో అంతర్జాతీయ క్రికెట్‌లో విజయవంతంగా కొనసాగుతున్నాడు.
ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్ కోసం సీఎస్‌కే, కేకేఆర్ మధ్య పోటీ జరిగింది. చివరకు కేకేఆర్ రూ.25.20 కోట్లకు అతన్ని కొనుగోలు చేసి, మిచెల్ స్టార్క్ రికార్డును దాటింది. అయితే గ్రీన్‌కు నిబంధనల ప్రకారం రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి, మిగిలిన మొత్తం బీసీసీఐ సంక్షేమ నిధికి వెళ్తుంది. క్రానిక్ కిడ్నీ వ్యాధి కారణంగా కండరాల తిమ్మిర్లు ఎదురైనా, గ్రీన్ వెనకడుగు వేయకుండా ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆల్‌రౌండర్ గా నిలిచాడు.

