సినిమాలో నటించనున్న కాంగ్రెస్ సీనయర్ నేత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తాను త్వరలో ఒక ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నానని తెలిపారు. మాఫియాను ఎదిరించి ఒక ఆడపిల్లకు పెళ్లి చేసే బాధ్యతాయుతమైన కేరక్టర్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. పీసీసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకుని ఈచిత్రంలో నటిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఉగాది పండుగకు స్క్రిప్టు వింటానని పేర్కొన్నారు. ఈ చిత్రానికి జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్ అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు.