ఐఐటీలపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
అమెరికాలోని కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా ఇటీవల భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీలపై వరుస ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఐఐటీ రాంచీలో అసభ్యకర వీడియోలు వచ్చాయని పేర్కొన్న ఆయన తాజాగా ఐఐటీ రూర్కీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఐఐటీ రూర్కీలో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా హ్యాకింగ్ జరిగిందని పేర్కొన్నారు. దానిలోకి అసభ్యకర వీడియోలు వచ్చాయని, విద్యాసంస్థలలో ఇలా జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

