సీనియర్ కాంగ్రెస్ లీడర్ మృతి..
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ గిరిజా వ్యాస్ నేడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మార్చి 31న జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో ఆమె పూజ చేస్తూ ఉండగా, హారతి ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీనితో కుటుంబసభ్యులు ఉదయపూర్‌లోని ఆసుపత్రిలో చేర్చగా, మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. దీనితో అహ్మదాబాద్ తీసుకువెళ్లారు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా, రాజస్థాన్ మంత్రిగా పలు కీలక పదవులలో పనిచేశారు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఛైర్ పర్సన్‌గా కూడా సేవలందించారు. ఉదయపూర్, చిత్తోర్ గఢ్ నియోజక వర్గాల నుండి లోక్‌సభకు మూడు సార్లు ఎన్నికయ్యారు.

