హీరో విశాల్ హెల్త్‌పై సీనియర్ నటి కామెంట్స్..
తమిళ హీరో విశాల్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది. ఒక వేదికపై మాట్లాడుతూ ఆయన వణకడం అభిమానులను కలవరపెట్టింది. అయితే అభిమానులు కంగారు పడొద్దని సీనియర్ నటి కుష్బూ పేర్కొన్నారు. విశాల్ అనారోగ్యం విషయంలో క్లారిటీ ఇచ్చారు. విశాల్‌కు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని, 103 టెంపరేచర్‌తో ఆయన తన మూవీ మదగజరాజు ఈవెంట్‌కు హాజరయ్యారని వివరణ ఇచ్చారు. ఈ చిత్రం 11 ఏళ్ల పాటు రకరకాల కారణాలతో విడుదల కాలేదని, ఇన్నేళ్ల తర్వాత విడుదల కానుండడంతో అంత జ్వరంతోనూ విశాల్ వచ్చారని తెలిపారు. ఈవెంట్ అనంతరం ఆసుపత్రికి వెళ్లారు. కోలుకుంటున్నారని తెలిపారు. కొన్ని మీడియాలు వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

