Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

భర్త వర్థంతి సభలో సీతక్క..

తన భర్త కుంజ రాము వర్థంతి సభలో తెలంగాణ పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో ఎన్నో కష్టాలు పడ్డామని, ఒకసారి ఎన్‌కౌంటర్ నుండి వెంట్రుకవాసిలో బయటపడ్డామని చెప్పారు. అలా ప్రాణాపాయం నుండి బయటపడిన నాకు ఈ జీవితం బోనస్‌లాంటిదన్నారు. పేదలు, ఆదివాసీ అట్టడుగువర్గాల ప్రజల కోసం, వారి రక్షణ కోసం ప్రస్తుతం ప్రజా జీవితాన్ని కొనసాగించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. వారి సేవ కోసం చివరి శ్వాస వరకూ పనిచేస్తానని హామీ ఇచ్చారు. తన కుమారుడు, కోడలితో కలిసి ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తన భర్త గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. “కామ్రేడ్ కుంజ రాము చిన్నతనం నుంచి విప్లవ ఉద్యమాలకు వెళ్లి అనంతరం ఆదివాసి ఉద్యమాలకు వైపు సాగుతున్న క్రమంలో పోలీసులు ఎన్​కౌంటర్​లో చనిపోయారు. ఈరోజు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామని కాదు, ప్రజల కోసం ఎంత అందుబాటులో ఉన్నామనేదే ముఖ్యం. రాము ఇచ్చిన స్ఫూర్తితో ప్రజల కోసం పని చేస్తాం. ప్రజల కోసమే మరణిస్తాం.” అని పేర్కొన్నారు.