జగన్ మాస్క్‌తో సీదిరి ‘సెల్ఫీ ఛాలెంజ్’
పలాసలో కిడ్నీ సెంటర్‌లో జగన్ మాస్క్ పెట్టుకుని టీడీపీ నేతలకు సెల్ఫీ వీడియోతో ఛాలెంజ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలంటూ, ఒక్కపోర్టు కైనా చంద్రబాబు శంకుస్థాపన చేసారని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ చేసారు. దీనికి టీడీపీ నేత రామ్మోహన్ కౌంటర్ వేస్తూ మూలపేట పోర్టుకు నాలుగేళ్లుగా సీఎం ఏంచేసారని, పేరు మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. మూడు రాజధానులు ముగిసిన కథ అని, విశాఖలో కాపురం అంటే కబ్జాలేనని ఎద్దేవా చేసారు.

