షర్మిలకు భద్రత సరిపోదు
ఏపీ కాంగ్రెస్ నేతలు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత పెంచాలని కోరుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్, షర్మిలల మధ్య ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమెకు ముప్పు ఉందని, భద్రత పెంచాలని డీజీపీని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం 2 ప్లస్ 2 గన్‌మేన్ల స్థానంలో 4 ప్లస్ 4 గన్ మేన్ల భద్రతను కల్పించాలని కోరారు.

