మ్యూచువల్ ఫండ్స్ వినియోగదారులకు సెబీ గుడ్ న్యూస్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెబీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలు వసూలు చేసే వార్షిక ఫీజును తగ్గించింది. ఫీజు నిర్మాణం సులభం కావడం, పారదర్శకత పెరగడం, పెట్టుబడిదారుల ప్రయోజనాలు బలపడడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. సెబీ మ్యూచువల్ ఫండ్ల బ్రోకరేజ్ చార్జీలను తగ్గించింది. క్యాష్ మార్కెట్లో 12 నుంచి 6 బేసిస్ పాయింట్లు, డెరివేటివ్స్‌లో 5 నుంచి 2 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. ఎగ్జిట్ లోడ్‌పై అదనపు 5 బేసిస్ పాయింట్ల చార్జ్‌ను కూడా తొలగించింది. ఈ మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. సెబీ తీసుకున్న నిర్ణయాలతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ఖర్చు తగ్గుతుంది. దీని వల్ల దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశం పెరుగుతుంది. పారదర్శకత పెరగడంతో రీటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఎక్కువయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో లిక్విడిటీకి ఇది సహకరిస్తుంది. అయితే తక్షణంగా మార్కెట్ సెంటిమెంట్ పై పెద్ద ప్రభావం ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌కు ప్రధాన ఆందోళన నిరంతర అమ్మకాలే. సెబీ చర్యలు సానుకూలమైనవైనా, దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు ఎక్కువ లాభం చేకూర్చే సూచనలుగా నిపుణులు చెబుతున్నారు.

