NationalNews Alert

స్కూల్ చిన్నారుల డేంజర్ జర్నీ

ఆటోల్లో ప్రయాణిస్తున్న చిన్నారులు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారంటూ పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. స్కూల్ ఆటోలను నడిపే వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కానీ వారు మాత్రం అసలు జాగ్రత్తలే పాటించడం లేదు. తాజాగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరుపై విశ్లేషించిన ట్రాఫిక్ పోలీసులు.. ఆటో డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే చిన్నారులు ప్రమాదాల బారినపడుతున్నారని తెలిపారు. కొందరు ఆటోవాలాలు కాసులకు కక్కుర్తిపడి చిన్నారుల ప్రాణాలకు ముప్పు మారుతున్నారన్నారు. చిన్న పిల్లలే కదా అని ఎంత మందినైనా సర్దుకునేలా చేసి వారి మరణానికి కారకులవుతున్నారంటూ నివేదక విడుదల చేశారు. ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించడం… ఆటో సైడ్స్‌లో కుర్చోబెట్టడం చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. ర్యాష్ డైవింగ్‌తో మరికొందరు ఇలా ఎదో కారణంతో స్కూల్ ఆటోలు డేంజర్‌కి కేరాఫ్ అడ్రాస్‌గా మారుతున్నాయి. ఆటోలను నియంత్రించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.