‘సీన్ రీక్రియేషన్’ ..సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా ఆయన సంథ్య థియేటర్‌కు కూడా వెళ్లాల్సి రావచ్చని సమాచారం. సీన్ ఆఫ్ అఫెన్స్( సీన్ రీక్రియేషన్) కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని, దాదాపు 10 ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని సమాచారం. వీటిలో ఇటీవల ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలపై కూడా విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయన ఏ-11గా ఉన్నారు. ఇప్పటికే తన లీగల్ టీమ్‌తో కలిసి సమావేశమైన అల్లు అర్జున్ ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే అవకాశం ఉంది.
BREAKING NEWS: ఒలింపిక్స్‌లో గెలిచినా పట్టించుకోవట్లేదు’..మను తండ్రి ఆవేదన