ఇందిరాగాంధీ జయంతికి మహిళా సంఘాలకు చీరలు
తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున తెలంగాణ మహిళా సంఘాలలోని మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నవంబర్ 19న ఇందిరా జయంతిని మహిళలతో పండుగలా జరుపుకుంటామని ఆమె తెలిపారు. సిరిసిల్లలో చీరల తయారీని పరిశీలించిన సందర్భంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. మహిళా సంఘాల మహిళల గౌరవం పెంచేలా ఒకే రకమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో రాష్ట్రంలో మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చేలా క్యాబినెట్ లో చర్చిస్తామన్నారు.