సంక్షామ హాస్టళ్ళే అవి…
ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ,పనితీరు పై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వసతి గృహలలో విద్యార్ధులకు అందిస్తున్న భోజన వివరాల పై రాజకీయ ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో కోర్టు పై విధంగా స్పందించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాలు, పాఠశాలల భవనాల నిర్వహణ, వసతుల పై న్యాయవాది చిక్కడు ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన మీదట ఆదేశాలు ఇచ్చింది.అవి సంక్షేమ హాస్టళ్లు కాదని,సంక్షామ హాస్టళ్లంటూ ప్రభాకర్ కోర్టుకు విన్నవించారు. 9 వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం వసతులు కల్పించడం లేదని తన వాదనలలో తెలిపిన చిక్కుడు ప్రభాకర్ వాదనలతో కోర్టు ఏకీభవించి కమిటీ వేసింది.కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

