విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన సంజూ
దేశవ్యాప్తంగా ఇప్పుడు IPL మేనియా నడుస్తోంది. ఈ IPL 2023లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు సృష్టించాడు. కాగా నిన్న SRH Vs RR కు మధ్య జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. ఈ మెగా టోర్నీలో SRHపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. నిన్నటి మ్యాచ్‌లో అర్థ శతకం(55) పైనే పరుగులు నమోదు చేసిన సంజూ..ఓవరాల్‌గా ఆ జట్టుపై 725 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. అయితే సంజూ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ 569,షేన్ వాట్సన్ 566,డివిలియర్స్ 540 ,అంబటి రాయుడు 540 పరుగులు చేశారు. దీంతో ప్రస్తుతం సంజూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సంజూ ఆటలో ఇలానే రాణిస్తే ఈసారి IPL కప్పు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.