భారత ‘సుప్రీం’ గా సంజీవ్ ఖన్నా ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సంజీవ్ ఖన్నా …భారత సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.సోమవారం ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్ర పతి,మంత్రులు ,పలువురు సీఎంలు హాజరయ్యారు.కాగా 2019 నుంచి ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 1960 మే 14న జన్మించిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టాను అందుకున్నారు.అక్కడ నుంచి అడ్వకేట్‌గా ,పలు ప్రభుత్వ కీలక బాథ్యతలు పోషించిన న్యాయవాదిగా,న్యాయమూర్తిగా మంచి పేరు గడించారు. ఈ సందర్భంగా దేశంలోని పలవురు ప్రముఖులు ఖన్నాకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.