వచ్చే నెలలో సానియా టెన్నిస్‌కు గుడ్‌బై
టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తన కెరీర్‌కు గుడ్ బై చెప్పబోతోంది. స్వయంగా ఆమెనే దీనిపై స్పష్టత ఇచ్చింది. దుబాయిలో వచ్చే నెలలో జరిగే WTA 1000 టోర్నమెంట్ తర్వాత తన కెరీర్‌కు ముగించబోతున్నానని సానియా ప్రకటించింది. ఓ వెబ్‌సైట్‌తో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. టెన్నిస్ ఆడటం కోసం తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తోందని… చిన్నారిని ఇబ్బంది పెట్టలేనని సానియా తెలిపింది. తన శరీరం కూడా ఇంతకు ముందులా సహకరించడం లేదని చెప్పింది. ప్రస్తుతం తన వయస్సు 36 ఏళ్లు. తనకు నచ్చినట్టుగా చేస్తానని ఆమె పేర్కొంది.