ఒక్క ఫోటోతో అభిమానులను ఫిదా చేసిన సానియా మీర్జా..
భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఆపరేషన్ సింధూర్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఒక్క ఫోటో అభిమానులను సంబరపరిచింది. పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్‌లు ఈ ఆపరేషన్ గురించి వివరించిన ఫోటోను షేర్ చేసింది సానియా మీర్జా. వారిద్దరూ ఈ ఆపరేషన్ చేపట్టడమే కాకుండా ప్రెస్‌మీట్‌లో కూర్చుని ఐక్యతకు ప్రతీకగా నిలిచిన తీరు అందరినీ అబ్బురపరిచింది. “ఈ శక్తివంతమైన ఫోటో మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.” అంటూ సానియా మీర్జా పేర్కొన్నారు. ఆమె గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుని, విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.