ప్రభాస్ హీరోగా డబుల్ రోల్‌కు ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి?
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయెల్ (డబుల్ యాక్షన్) రోల్‌లో కనిపించబోతున్నారని.. ప్రభాస్ రెండు పాత్రల్లో ఒక పాత్ర నెగిటివ్, మరోపాత్ర పాజిటివ్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఇంటర్వెల్‌లోనే ప్రభాస్ రెండోపాత్ర రివీల్ అవుతుందని.. సినిమా మొత్తానికే ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే, ఈ వార్తల విషయంలో ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే, 80 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తీయబోతున్నారు.

