సమంత బిగ్ ప్లాన్..
సమంత బాలివుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తన తొలి బాలివుడ్ సినిమాకు సమంత బిగ్ ప్లాన్ వేసినట్టు సమాచారం.మొదటి సినిమాలోనే డిఫరెంట్ స్టోరీతో ఎంట్రీ ఇస్తునట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో వరుణ్ దావన్ జోడిగా , డ్యూయల్ రోల్‌లో నటించనున్నట్టు తెలిసింది. అయితే యాక్షన్ ధ్రిల్లర్‌గా నిర్మించనున్న ఈ చిత్రంలో సమంత ఒక పాత్రలో క్వీన్‌గా కనిపించనున్నట్టు టాక్ కూడా నడుస్తోంది. సమంతకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారిలో ఆమె కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగులో ఖుషి , యశోద అనే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత అటూ బాలివుడ్‌లోనూ తన జోరును కొనసాగిస్తోందో లేదో వేచి చూడాలి.

