ఇన్‌స్టాలో పెళ్లిఫోటోలు షేర్ చేసిన సమంత..ప్రేమపై కామెంట్స్..
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉంటారు. హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె మయోసైటిస్ బారిన పడి చికిత్స తీసుకోవడం, ఇప్పుడు కొన్నాళ్లు నటనకు బ్రేక్ తీసుకోవడంతో సహా అన్ని విషయాలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. తన సోదరుడు డేవిడ్ ప్రభు వివాహం మూడు రోజుల క్రితం అమెరికాలో జరగింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ, అన్నింటికంటే ప్రేమ ముఖ్యం అనే క్యాప్షన్‌ను జత చేసింది. తన కుటుంబంతో చాలాకాలం తర్వాత సరదాగా గడిపినట్లు పేర్కొంది. డేవిడ్ ప్రభుకు నికోల్ అనే మహిళతో క్రిస్టియన్ పద్దతిలో ఈ వివాహం జరిగింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.


