సమంత ‘సిటాడెల్’ టీజర్ విడుదల
వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన సిటాడెల్- హనీ బన్నీ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. నవంబర్ 7 నుండి ఈ సిరీస్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో కేకే మేనన్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సమంత గతంలో వీరితో ఫ్యామిలీ మ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

