సల్మాన్ కు మళ్లీ వార్నింగ్
బాలీవుడు అగ్రకధానాయకుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు. సల్మాన్ ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వార్నింగ్ లు వచ్చాయి. ఆయన కారును బాంబుపెట్టి పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. ముంబై వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి అగంతకుడు వాట్సాప్ సందేశం చేశాడు. నేరుగా ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరుపుతామని , లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చి చంపుతామని వాట్సాప్ మేసేజ్. ఈ ఘటన అనతంరం వెంటనే ముంబాయి పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వాట్సాప్ మేసేజ్ పెట్టిన ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బాలీవుడు స్టార్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఈ వార్నింగ్ లు వచ్చాయి. పలుమార్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురుకున్నారు. గతేడాది సల్మాన్ ఇంటి సమీపం బాంద్రా గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్ హౌస్ లోకి చొరబాటు యత్నం అప్పట్ల కలకలం రేపింది. ఇటీవల ఆయన చేస్తున్న బిగ్ బాస్ షో షూటింగ్ రద్దు చేసుకున్నారు. సల్మాన్ కు బెదిరింపులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం వై ప్లస్ భద్రతను ఇచ్చింది. భారీ భద్రత మధ్య సల్మాన్ షూటింగ్స్ , పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. వాట్సాప్ సందేశం పంపిన ఆగంతకుడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.