సైమా 2024: 12వ ఎడిషన్ సైమా అవార్డ్స్‌కు నామినేట్ అయిన చిత్రాల జాబితా వెలువడింది.
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డులు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) (సైమా 2024 నామినేషన్స్). ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు జై(12వ ఎడిషన్) దుబాయ్ వేదిక కానుంది. ఈ పురస్కారాలకు పోటీపడుతున్న చిత్రాల జాబితాను సైమా టీమ్ తాజాగా విడుదల చేసింది (2023 లో రిలీజైన సినమాలు). అత్యధికంగా 11 విభాగాల్లో తెలుగు నుంచి నాని ‘దసరా’,తమిళ్ నుంచి రజనీకాంత్ ‘జైలర్’నామినేట్ అయ్యాయి. టొవినో థామస్ 2018 (మలయాళం), దర్శన్ ‘కాటేర’(కన్నడ) 8 విభాగాల్లో పోటీ పడుతున్నాయి.