సైఫ్ ఖాన్‌పై దాడి కేసులో అరెస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో దర్యాప్తు తీవ్రతరమయ్యింది. ఈ కేసులో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ దాడిలో మొదట దుండగుడు చోరీకి ప్రయత్నించినట్లు భావించారు. సైఫ్ అడ్డుకోబోతుండగా, కత్తితో దాడి చేశాడు. పలు కత్తి పోట్లతో గాయాలపాలైన సైఫ్‌ను పెద్దకుమారుడు ఇబ్రహీం ఖాన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని సీసీ కెమెరాలో గుర్తించిన పోలీసులు బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు గమనించి, చివరకి పట్టుకున్నారు. దాడి చేయడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. బాంద్రాలోని పోలీసు స్టేషన్‌కు అతడిని తరలించారు. ప్రస్తుతానికి సైఫ్ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స చేసి, బ్లేడ్ ముక్కను బయటికి తీశారు. చేతికి, మెడకు గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు ప్రాణాపాయం లేదని, కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు.