Home Page SliderNational

షేన్‌వార్న్ మొదటి వర్థంతిని తలచుకుని సచిన్ ట్వీట్

ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ మొదటి వర్థంతిని పునస్కరించుకుని భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉద్వేగ భరిత ట్వీట్ చేశారు. గత సంవత్సరం మార్చి 4న హార్ట్ ఎటాక్‌తో షేన్‌వార్న్ థాయ్‌లాండ్‌లో హాలిడే గడుపుతూ చనిపోయారు. తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తామిద్దరూ కలిసి ఎన్నో మైదానాలు పంచుకున్నామని, ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడామని ట్వీట్‌లో పేర్కొన్నారు. మీరు గొప్ప క్రికెటరే కాకుండా గొప్ప స్నేహితులు కూడా అని కొనియాడారు. స్వర్గంలో శాంతి పొందుతున్నారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. తనకు వార్న్‌తో కలిసి ఆడడం ఎప్పుడూ ఛాలెంజ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు.