Home Page SliderInternational

యువ టెన్నిస్ స్టార్‌ని ప్రశంసలతో ముంచెత్తిన సచిన్

మొట్టమొదటిసారిగా వింబుల్డన్ టైటిల్ సాధించిన యువ కెరటం, టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాస్‌పై భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. కార్లోస్‌ను 20 సార్లు గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రోజర్ ఫెదరర్‌తో పోల్చుతూ, కార్లోస్ కూడా అంతటివాడేనన్నాడు. ఫెదరర్ కెరీర్‌ను తాను ఇంతవరకూ అనుసరిస్తూ వచ్చానని, ఇకపై మరో పదేళ్లపాటు అల్కరాస్ కెరీర్‌ను కూడా ఫాలో అవుతానని అభినందనలు కురిపించారు సచిన్. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే గత ఐదేళ్లుగా ఓటమి ఎరుగని జకోవిచ్‌ను ఓడించిన వీరుడంటూ మెచ్చుకున్నారు. భవిష్యత్తులో అగ్రశ్రేణి ఆటగాడిగా గుర్తింపు సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వింబుల్డన్ మ్యాచ్‌లలో కార్లోస్ అల్కరాస్ దిగ్గజ ఆటగాడైన జకోవిచ్‌ను సునాయాసంగా 6-1,3-6,6-4 తేడాతో ఓడించి టైటిల్‌ను సాధించారు.