రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రాల్లో సభలు: టీడీపీ-జనసేన
ఏపీ: రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు టీడీపీ, జనసేన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 3 ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రాల్లో సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు రెండు పార్టీల వర్గాలు తెలిపాయి. మేనిఫెస్టో ప్రకటనకు ముందు లేదా తర్వాత సభలను నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నాయి.

