రష్యా, ఉత్తర కొరియా బంధం కొంత ఆందోళనకరమే: అమెరికా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ, రేపు ఉత్తర కొరియాలో పర్యటించనుండడంపై యూఎస్ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ పర్యటన గురించి మాకు ఏమి అంత ఆందోళన లేదు కానీ, రెండు దేశాల బంధం గట్టిపడడమే మాకు కొంత కష్టం కలిగిస్తోంది. ఉత్తర కొరియా ఇస్తున్న క్షిపణుల్నే రష్యా ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తోంది. ఇప్పుడు కొరియా ద్వీపకల్ప పరిస్థితుల్నీ పుతిన్ పర్యటన ప్రభావితం చేయొచ్చేమో అని అమెరికా వాపోయింది.